published by Hari on Fri, 05/18/2012 - 06:55
1) 'గబ్బర్ సింగ్' విజయవంతం అయినందుకు అభిమానులలో కలుగుతున్న ఆనందం మాటలలో వర్ణించలేనిది.
2) 100 కోట్లు ప్రాఫిట్ సాధించే మొదటి తెలుగుసినిమా అవబోతుందని నిన్న ఒక పెద్దాయన అంటుంటే అతిశయోక్తోమో అనిపించింది కాని, నిజం అయినా ఆశ్చర్యపోవక్కర్లేదని మరికొందరి నుంచి విన్నప్పుడు నోటి మాట రాలేదు.
published by Hari on Thu, 05/17/2012 - 19:29
'గబ్బర్ సింగ్' సినిమా పబ్లిసిటి కోసం 'గబ్బర్ సింగ్' ను అనుకరిస్తూ ఒక పది పదిహేను నిమషాల పాటు సాగే ఒక షార్ట్ ఫిలింను pawanfans.com creative works టీమ్ ప్లాన్ చేసింది. ఆ షార్ట్ ఫిలిం పేరు 'పబ్లిక్ కింగ్'. ఈరోజే కొద్ది సేపట్లో షూటింగ్ ప్రారంభం కానుంది.
'పబ్లిక్ కింగ్' డైరక్టర్ ఎన్ని రోజులు షూటింగ్ చేస్తాడో తెలియదు. ఒకే లోకేషన్ కాబట్టి ఒక రోజులో అయిపోతుందనుకుంటున్నాను. నాకు చెప్పిన కాన్సప్ట్ అయితే బాగుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే 'పబ్లిక్ కింగ్' అని పేరు ఎందుకు పెట్టాడో, 'పబ్లిక్ కింగ్' అంటే ఎవరు? అనే పాయింట్ చాలా బాగుంది. ఆ పాయింట్ ను జనారంజకంగా చెపుతాడో లేదో చూడాలి.
published by Hari on Thu, 05/17/2012 - 05:48
పబ్లిసిటీ - ఎటువంటి సినిమా చూడబోతున్నామో, ఎటువంటి ఎక్సపేటెషన్స్ తో సినిమాకు రావాలో చెప్పడం
హైప్ - ఎక్సపేటెషన్స్ పెంచడం
భారీ ఓపినింగ్స్ సాధించడంతో పాటు మంచి పాజిటివ్ టాక్ కూడా సంపాదించు కోవాలంటే ఏ సినిమాకైనా పబ్లిసిటీ & హైప్ రెండూ చాలా అవసరం. హైప్ లేకపోతె ఓపినింగ్ కలక్షన్స్ డల్ గా వుంటాయి. అలా అని హైప్ కోసమే పబ్లిసిటీ చేస్తే ఘోరమైన ఫ్లాప్ టాక్ వస్తుంది.
'గబ్బర్ సింగ్' సినిమాను హైప్ చెయ్యడంలో హరీష్ శంకర్ సక్సస్ సాధించాడు. ఆ హైప్ కు తగ్గకుండా సినిమా అందించాడు.
published by Hari on Wed, 05/16/2012 - 21:31
మ్యూజిక్ ను ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవడం పైరసీ కాదు.
డూప్లికేట్ డి.వి.డిని తక్కువ ధరకు కొనుక్కోవడం పైరసీ కాదు.
మన ప్రత్యర్ది హీరోల సినిమాలు డ్రిస్టిబ్యూట్ చెయ్యడం పైరసీ కాదు.
మన సినిమా దర్శక నిర్మాతలు వేరే లాంగ్వేజెస్ నుంచి కాపి కొట్టడం తప్పు కానప్పుడు, మనం పైరసీని ఎంకరేజ్ చెయ్యడం అసలు తప్పు కాదు.
పైరసీ చేసే ప్రతివోడు ఇలా ఇదో ఒక రీజన్ చెపుతూ వుంటాడు.
published by Hari on Wed, 05/16/2012 - 05:54
Its Official: USAలో నెం 1 సినిమా గబ్బర్ సింగ్
అని ట్వీట్ చెయ్యడానికి పవన్ కళ్యాణ్ ట్వీటర్ లో లేడు.
మెగా అభిమాని మరియు ఒక ఏరియా డిస్టిబ్యుటర్ లెక్కల ప్రకారం, "దూకుడు" ఫుల్ రన్ లో 1.5M కలెక్ట్ చేసింది. "గబ్బర్ సింగ్" నాలుగు రోజుల్లో 1.1M కలెక్ట్ చేసింది. ఈ విధంగా దూకుడుని లెఫ్ట్ లెగ్ తో కొడుతుంది "గబ్బర్ సింగ్" ఫుల్ రన్ లో అని అంటున్నారు.
నాకు తెలిసి చాలా మంది లాస్ట్ వీక్ టిక్కెట్స్ దొరక్క, నెక్స్ట్ వీకేండ్ కు ప్లాన్ చేసుకున్నారు. ఈ లెక్కన చూస్తే సెకండ్ వీక్ కూడా USAలో కలక్షన్స్ దుమ్ము లేపుతాది.
published by Hari on Tue, 05/15/2012 - 18:49
‘గబ్బర్ సింగ్’ సినిమా పవన్ కళ్యాణ్ కు పూర్వ వైభవాన్ని తేవడమే కాదు, మెగా అభిమానులలో నూతనోత్సాహాన్ని నింపింది. కేవలం మెగా అభిమానులలో మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులందరిలోను సినిమాలపై ఆసక్తిని పెంచింది.
ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి కారణం పవన్ కళ్యాణ్ కు నిజంగానే కొద్దిగా తిక్క(ఎవరికి హాని కలిగించని) అనే ఇమేజ్ వుండటం. ఆ తిక్క క్యారెక్టరైజేషన్ కు లెక్క వుందంటూ కరెక్ట్ జస్టిఫికేషన్ డైలాగ్స్ ద్వారా చెప్పించడం.
published by Hari on Mon, 05/14/2012 - 20:47
Sreenivas kumar @sknonline
Stay tuned 4 1st week Records, GS gonna sweep all prev 1st week shares with HUGE MARGIN. It's mind blowing B.O potentiality of POWERSTAR
గబ్బర్‌సింగ్ ఒక కోణంలో చూస్తే 1) కథ లేదు 3) పవన్‌కల్యాణ్ రొటీన్ యాక్షన్ 3) దేవిశ్రీ ప్రసాద్ పాత ట్యూన్సే లిరిక్స్ మార్చాడంతే 4) హిరోను ఆకాశానికి ఎత్తేసే పంచ్ డైలాగ్స్ .. ఇలా చెప్పుకుంటూ పొతే, సినిమాలో ఏమి కొత్తదనం కనిపించదు. కానీ తెలుగుప్రేక్షకులకు ఏమి కావాలో అవి సమపాళ్ళల్లో కుదిరి సూపర్‌హిట్ సంపాదించుకుందు పవన్‌కల్యాణ్ లేటేస్ట్ రిలీజ్ ’గబ్బర్‌సింగ్’.
published by Hari on Mon, 05/14/2012 - 18:57
రచ్చ - ఉహించని విధంగా కమర్షియల్ విజయం సాధించడమే కాదు, మెగా అభిమానులకు చరణ్ లో చిరంజీవి కనిపించి "తెలుగు సినిమాలలో చిరంజీవి నటించని లోటును మాకు చరణ్ తీరుస్తాడనే" నమ్మకాన్ని ఇచ్చాడు.
గబ్బర్ సింగ్ - మెగా అభిమానులకే కాదు, ఏ హీరోకు అభిమానులకైనా విపరీతంగా నచ్చింది. రిపీటడ్ ఆడియోన్స్ ను థియేటర్ కు లాక్కు రావడం లో ట్రెండ్ సృష్టిస్తుంది.
ఇదే బాటలో మరో మెగా మూవీ "జులాయి" కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశీద్దాం.
published by Hari on Sun, 05/13/2012 - 09:15
ఆదిపత్యం డబ్బు కోసం జనాలను వెర్రిపప్పాలను చేసి, జర్నలిజం కూడా కులం/మతం/ప్రాంతం ఫీలింగ్స్ తో ఎలా కొట్టుకు చస్తుందో ఇక్కడ చూడండి.click here
పవన్ కళ్యాణ్ ను పూరీ జగన్నాథ్ ను ఒక మెసేజ్ ఓరియంటడ్ సబ్జక్ట్ చెయ్యమని చెప్పాడంట. దాని ఫలితమే ' కెమెరామేన్ గంగతో రాంబాబు'. నిశితంగా పరిశీలిస్తే 'గబ్బర్ సింగ్' కూడా మెసేజ్ ఓరియంటడ్ సినిమానే. పవన్ కళ్యాణ్ స్టైల్ , ఆ స్టైల్ కు వినోదం ఎలా జోడిస్తారు అనే దానిపైనే సినిమా ఎంత మందికి రీచ్ అవుతుందని ఆదారపడి వుంది.
published by Hari on Sat, 05/12/2012 - 11:36
Harish Shankar next film would mostly be with NTR. Even NTR reportedly loved the one-line narration that Harish Shankar gave to him some time back. The film might go to the sets toward the end of this year. - telugucinema.com
అందరి హిరోలతో పని చెయ్యాలనుకునే ఇండస్ట్రీలో ఎవరినైనా మీ అభిమాన హిరో ఎవరు అని అడిగితే నిజం చెప్పరు. దానికి కారణం 1) భయం అయ్యి వుండవచ్చు 2 ) లౌక్యం అని వారు అనుకొవచ్చు.
హరీష్ శంకర్ భయం లేకుండా, లౌక్యం తొక్క తోలు అని ఆలోచించకుండా "నేను పవన్ కల్యాణ్ వీరాభిమానిని" అని ఎప్పుడో డిక్లేర్ చేసేసాడు.
Pages